భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు​. దళితుల జీవితాలలో వెలుగులు నింపి "బాబాసాహెబ్" గా ప్రసిద్ధి చెందిన ఆయన్ని మనసారా స్మరించుకుందాం.

భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, ధర్మశాస్త్రపండితుడు, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, తత్వ శాస్త్రవేత్త, చరిత్రకారుడు, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త, భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ జయంతి నేడు.

ఆయన 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లో జన్మించారు. ఏడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆయన 1917లో గౌరవ డాక్టరేట్ ను పొందారు. 1918-20 కాలంలో లెక్చరర్ గా పనిచేసిన ఆయన 1923 నుండి ముంబై హైకోర్టు న్యాయవాదిగా పనిచేసి దళితులకు ఆశాజ్యోతి అయ్యారు. 1927లో హిందూ దేవాలయాలలో దళితుల ప్రవేశం కోసం పోరాటం చేశారు. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటుచేశారు. దేశ స్వాతంత్య్రానంతరం రాజ్యంగ రచనా సంఘానికి అధ్యక్షుడై 11 నెలలకు పైగా శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించారు. దాని ద్వారా అస్పృశ్యతను నిషేధింపజేసి, దళితులకు విద్య, ఉద్యోగం, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించారు. 1956 అక్టోబర్ 14న ఆరు లక్షల మందితో కలిసి నాగపూర్ దీక్షాభూమిలో వీరు బౌద్ధధర్మాన్ని స్వీకరించారు. దేశానికి దిశానిర్దేశం చేసి, దళితుల జీవితాలలో వెలుగులు నింపి "బాబాసాహెబ్" గా ప్రసిద్ధి చెందిన ఆయన్ని మనసారా స్మరించుకుందాం.

No comments:

Post a Comment

EACH GIVES WHAT HE HAS